Prabhakar: 'వదినమ్మ' ఫేమ్ శివపార్వతి ఆరోపణలపై స్పందించిన నటుడు ప్రభాకర్!

Prabhakar Comments on Actress Sivaparvati Allegations
  • ఆ ఆరోపణలన్నీ అవాస్తవం
  • శివపార్వతి ఫోన్ చేసి బాధపడ్డారు
  • మా మధ్య ఎలాంటి విభేదాలూ లేవు
  • ఆమె కోలుకున్నాక అన్నీ చెబుతానన్న ప్రభాకర్
తనపై నటి శివపార్వతి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని నటుడు ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. శివపార్వతిని 'అమ్మ'గా సంబోధిస్తూ, మాట్లాడిన ప్రభాకర్, ఆమె తనకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారని, కేవలం తప్పుగా అర్థం చేసుకున్న కారణంగానే ఆ వీడియో బయటకు వచ్చిందని, అది తాను పెట్టలేదని ఆమె స్పష్టం చేశారని అన్నారు. ఆమెకు ఏ అవసరం వచ్చినా చూసుకోవడానికి తామంతా ఉన్నామని, ఆమెకు కరోనా సోకిన తరువాత, సాయంగా నిలిచిన అందరికీ, ముఖ్యంగా శివబాలాజీ, జీవిత తదితరులకు కృతజ్ఞతలని తెలిపారు.

మొత్తం వివాదంపై తాను తప్పకుండా క్లారిఫికేషన్ ఇస్తానని, అది కూడా శివపార్వతమ్మ కోలుకున్న తరువాత చెబుతానని అన్నారు. శివపార్వతమ్మ ఆరోపణల వీడియో బయటకు వచ్చిన తరువాత, తాను స్పందించాలని ఎందరో మిత్రులు, మీడియా వారు కోరారని, అందుకే ఈ వీడియోను విడుదల చేస్తున్నానని స్పష్టం చేసిన ఆయన, తమ మధ్య  ఎటువంటి విభేదాలు లేవని, అసలు తన వ్యాఖ్యల వీడియో యూట్యూబ్ లోకి ఎలా వచ్చిందో తెలియడం లేదని శివపార్వతి స్వయంగా తనకు ఫోన్ చేసి చెప్పి, బాధపడ్డారని ఆయన అన్నారు.
Prabhakar
Sivaparvathi
Video

More Telugu News