Somu: ఇలాంటి ప్రాంతాన్ని ఇళ్ల స్థలాలకు కేటాయిస్తారా?: సోము వీర్రాజు ఫైర్

How can you allot these kind of lands for housing plots questions  Somu Veerraju
  • వరద నీటిలో మునిగిపోయే స్థలాలను కేటాయించారు
  • చేసిన తప్పులను సరిదిద్దుకోండి
  • అడ్డగోలుగా ఇలాంటి భూములను కొనుగోలు చేస్తున్నారు
వరద నీటిలో మునిగిపోయే స్థలాలను ఇళ్ల స్థలాలకు కేటాయించారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. వర్షాలకు ఇప్పటికే ఈ ప్రాంతమంతా మునిగిపోయిందని... మళ్లీ వర్షం వస్తే 30 వేల మందికి పునరావాసం ఎక్కడ ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ఈ భూములకు ఇచ్చిన డబ్బును వెనక్కి తీసుకుని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని... చేసిన తప్పులు సరిదిద్దుకోవాలని డిమాండ్ చేశారు.

ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి, ఒక యూనివర్శిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు స్వీకరించారని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపించకపోగా... ఇప్పుడు అడ్డగోలుగా ఇలాంటి భూములను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే తీరును కొనసాగిస్తే... ప్రభుత్వంపై బీజేపీ పోరాటాన్ని తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు.
Somu
BJP
Housing plots

More Telugu News