కరోనాతో మృతి చెందిన ఇంటి యజమాని.. అర్ధరాత్రి గోదావరిలో దూకి కుటుంబం ఆత్మహత్య
- విషయం తెలిసినా పరామర్శకు రాని బంధువులు, స్నేహితులు
- మనస్తాపంతో బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకిన కుటుంబం
- వరద ఉద్ధృతి కారణంగా సహాయక చర్యలకు అంతరాయం
విషయం తెలిసినప్పటికీ బంధువులు కానీ, స్నేహితులు కానీ పలకరించేందుకు రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నరసయ్య భార్య సునీత (50), కుమారుడు ఫణికుమార్ (25), కుమార్తె అపర్ణ (23) గత అర్ధరాత్రి రైల్వే బ్రిడ్జి పైనుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గోదావరి నది ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలకు అంతరాయం కలుగుతోందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.