Sanjay Dutt: ఈ క్లిష్ట సమయంలో మీ తోడు కావాలి: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ భార్య మాన్యత

Maanayata Says They Will Fight Tooth And Nail
  • ఊపిరితిత్తుల కేన్సర్‌తో పోరాడుతున్న సంజయ్‌దత్
  • అభిమానుల ప్రేమ, మద్దతుకు మాన్యత కృతజ్ఞతలు
  • ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి విజయవంతంగా బయటపడతామన్న మాన్యత
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్నట్లు ఇటీవల వచ్చిన వార్తలు బాలీవుడ్‌లో కలకలం రేపాయి. సంజయ్‌దత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అభిమానులు ట్వీట్లు చేశారు. తాజాగా, ఆయన ఆరోగ్యంపై భార్య మాన్యత ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ క్లిష్ట సమయాన్ని విజయవంతంగా అధిగమించేందుకు అందరి సహకారం కావాలని కోరారు. గతంలో ఎన్నో ఇబ్బందుల నుంచి తమ కుటుంబం బయటపడిందని, ప్రస్తుత పరిస్థితిని కూడా అధిగమిస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. దయచేసి ఎవరూ పుకార్లను నమ్మవద్దని, సంజయ్ ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటామని పేర్కొన్న మాన్యత .. తమ కుటుంబంపై చూపిస్తున్న ప్రేమ, ఇస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.

సంజయ్ దత్ కేవలం తన పిల్లలకు మాత్రమే కాకుండా, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మొత్తం కుటుంబానికే ఓ తండ్రిలా కాపుకాశాడని, ఆయనకు కేన్సర్ అని తెలిసిన వెంటనే కుటుంబం మొత్తం కదలిపోయిందని మాన్యత తెలిపారు. దీంతో అందరం కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నామని, ఈ సుదీర్ఘ పోరాటంలో అభిమానుల ప్రార్థనలు, ఆశీర్వాదాలు కావాలని కోరారు. అభిమానుల ప్రార్థనలు, దేవుడి ఆశీస్సులతో ఈ క్లిష్ట సమయం నుంచి బయటపడతామని మాన్యత ఆశాభావం వ్యక్తం చేశారు.
Sanjay Dutt
Bollywood
Maanyata dutt
Mumbai

More Telugu News