ఇండియాలో తొలుత అందుబాటులోకి వచ్చేది ఆక్స్ ఫర్డ్ వ్యాక్సినే!
- స్థానిక వ్యాక్సిన్ లనూ పరిశీలిస్తున్నామన్న అధికారి
- ముందు వచ్చేది ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్
- ఆపై కొన్ని వారాలకు దేశవాళీ వ్యాక్సిన్
ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కు, దేశవాళీ వ్యాక్సిన్ మార్కెట్లోకి రావడానికి మధ్య కొన్ని వారాల గడువు మాత్రమే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కే తొలుత అనుమతి లభిస్తుందని భావిస్తున్నామని, ఈ వ్యాక్సిన్ ను పుణె కేంద్రంగా పనిచేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ట్రయల్స్ నిర్వహిస్తూనే భారీ ఎత్తున తయారు చేసే ప్రక్రియలో ఉందని తెలిపారు. ప్రస్తుతం సీరమ్ ఇనిస్టిట్యూట్ మూడవ దశ ట్రయల్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ బయోటెక్, జైడస్ కాడిలా వంటి కంపెనీలు తొలి, రెండవ దశ ట్రయల్స్ లో ఉన్నాయి.