USA: జో బైడెన్ ను అధికారికంగా నామినేట్ చేసిన పార్టీ... తన జీవితంలో ఇది అతిపెద్ద గౌరవమని వ్యాఖ్య!

Joe biden Officially Nominated as President Candidate for Democrats
  • అధికారికంగా ప్రకటించిన డెమోక్రాట్లు
  • మద్దతుగా నిలిచిన మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జిమ్మీ కార్టర్
  • ఎన్నికలకు మరో 77 రోజులు
మరో రెండున్నర నెలల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తమ తరఫు అభ్యర్థిగా జో బైడెన్ ను నామినేట్ చేస్తున్నట్టు డెమోక్రటిక్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ రెండో రోజున బైడెన్ అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేసింది. ఈ కార్యక్రమానికి మాజీ దేశాధ్యక్షులు బిల్ క్లింటన్, జిమ్మీ కార్టర్ లతో పాటు, రిపబ్లికన్ స్టేట్ కార్యదర్శి కోలిన్ పావెల్, ఇతర నాయకులు హాజరయ్యారు.

ఇక తన పేరును ప్రకటించిన తరువాత జో బైడెన్ స్పందిస్తూ, ఇది తన జీవితంలో అతిపెద్ద గౌరవమని అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలంటూ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. కాగా, ఎన్నికలకు మరో 77 రోజులు ఉండగా, ఓటింగ్ డేట్ వరకూ దేశమంతా విస్తృతంగా పర్యటించాలని బైడెన్ ఇప్పటికే షెడ్యూల్ ను నిర్ణయించుకున్నారు. తన వైఖరితో ట్రంప్ సృష్టించిన గందరగోళాన్ని సరిచేసే అనుభవం బైడెన్ కు ఉన్నదని డెమోక్రాట్ నేతలు వ్యాఖ్యానించారు.
USA
Joe Biden
Democrats
Nominate

More Telugu News