Suma: మా అమ్మ మరింత చిన్నదైపోయింది: తల్లి పుట్టినరోజు సందర్భంగా సుమ వ్యాఖ్యలు

Anchor Suma convey birthday wishes to mother
  • తల్లికి బర్త్ డే విషెస్ తెలిపిన సుమ
  • తన అభివృద్ధికి తల్లే కారణమని వెల్లడి
  • లవ్యూ అమ్మా అంటూ ట్వీట్
ప్రఖ్యాత యాంకర్ సుమ తన తల్లి విమల పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర ట్వీట్ చేశారు. హ్యాపీ హ్యాపీ బర్త్ డే అంటూ తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సుమ, "మా అమ్మ మరో ఏడాది చిన్నదైపోయింది" అంటూ చమత్కరించారు. ఇవాళ తాను ఈ స్థితిలో ఉన్నానంటే అందుకు కారణం అమ్మేనని వెల్లడించారు. "నా ఉన్నతికి కారణం నువ్వేనమ్మా, లవ్యూ" అంటూ ట్విట్టర్ లో స్పందించారు. ఈ సందర్భంగా సుమ తమ ఫ్యామిలీ ఫొటోను కూడా పంచుకున్నారు.
Suma
Anchor
Mother
Vimala
Birthday

More Telugu News