Motion Poster: ఆగస్టు 22న మెగా కానుక... ఆచార్య చిత్రం నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్

First look motion poster from Chiranjeevi new film set to release
  • కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిరంజీవి
  • చిరు 152వ చిత్రంపై భారీ హైప్
  • వినాయకచవితి సందర్భంగా అభిమానులకు ట్రీట్
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ నుంచి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఆగస్టు 22న వినాయకచవితి సందర్భంగా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు చిరు 152వ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో రిలీజ్ కానుందని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ ట్వీట్ చేసింది. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ సమర్పణలో వస్తున్న ఈ సందేశాత్మక చిత్రానికి నిరంజన్ రెడ్డి నిర్మాత. చిత్రసమర్పకుల్లో ఒకరైన రామ్ చరణ్ స్పందిస్తూ, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో తాము రెడీగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ చిత్రానికి టైటిల్ అధికారికంగా ప్రకటించకపోయినా, ఆచార్య అనే టైటిల్ సర్క్యులేట్ అవుతోంది.
Motion Poster
First Look
Chiranjeevi
Acharya
Koratala Siva

More Telugu News