balasubramaniam: ఐసీయూలో బాలసుబ్రహ్మణ్యానికి.. ఆయన పాటలు వినిపిస్తోన్న వైద్యులు!

balasubrahmaniam listens his songs in hospital
  • చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స
  • బాలు భార్యకు కూడా కరోనా
  • వివరాలు చెబుతున్న కుమారుడు చరణ్
కరోనా సోకడంతో గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స తీసుకుంటోన్న విషయం విదితమే. ఈ క్రమంలో గతంలో బాలు పాడిన కొన్ని పాట‌ల‌ను ఆయనకు వినిపిస్తున్నార‌ని తెలిసింది.

ఆయన ఉన్న వార్డులో ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఆ పాటలను ఆడియో ద్వారా ప్రసారం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు, బాలసుబ్రహ్మణ్యం భార్య కూడా క‌రోనాతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి నిపుణులైన వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు చ‌ర‌ణ్ ఎప్పటికప్పుడు వివరాలు తెలుపుతున్నారు.
balasubramaniam
Corona Virus
COVID-19

More Telugu News