Sanjay Dutt: జైలు శిక్ష పడితే సినిమాల్లో నటించకూడదా?: కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Karnataka High court Comments on Sanjay Dutt Movie KGF 2
  • టాడా కేసులో సంజయ్ దత్ కు శిక్ష
  • కేజీఎఫ్-2లో ప్రస్తుతం నటిస్తున్న సంజయ్
  • అనుమతించరాదన్న పిటిషన్ కొట్టివేత
అక్రమంగా ఆయుధాలు కలిగివున్నారన్న కేసులో టాడా చట్టం కింద విచారణను ఎదుర్కొని, జైలు శిక్షను కూడా అనుభవించిన సంజయ్ దత్ నటిస్తున్న సినిమా షూటింగ్ కు కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది.

హుబ్లీ ప్రాంతానికి చెందిన శివశంకర్ అనే వ్యక్తి, ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేస్తూ, ఓ దోషి నటిస్తున్న సినిమాకు ప్రభుత్వం అనుమతి ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ఈ పిటిషన్ ను విచారించిన చీఫ్ జస్టిస్ ఏఎస్ ఓరా, ఈ కేసులో ఎటువంటి ప్రజా ప్రయోజనమూ కనిపించడం లేదని అన్నారు. శిక్ష పడిన వ్యక్తి సినిమాల్లో యాక్ట్ చేయరాదని చట్టంలో లేదని, అందువల్ల దీన్ని కొట్టి వేస్తున్నామని ప్రకటించారు.

 కాగా, 'కేజీఎఫ్' సినిమా సూపర్ హిట్ గా నిలిచి, కలెక్షన్ల చరిత్రను తిరగరాసి, అన్ని భాషల్లోనూ విజయవంతమైన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా 'కేజీఎఫ్-2' పేరిట నిర్మితమవుతున్న చిత్రంలో సంజయ్ దత్ నటిస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్ 'అధీరా' పాత్రను పోషిస్తుండగా, ఇటీవల ఆయన లుక్ విడుదలై వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Sanjay Dutt
Karnataka
High Court
KGF-2

More Telugu News