Tollywood: నటి కాజల్ సీక్రెట్ ఎంగేజ్‌మెంట్.. వరుడు బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త?

Actress Kajal Agarwal secret Engagement with Gautham
  • తల్లిదండ్రులు చూసిన సంబంధానికి కాజల్ ఓకే
  • ఇరు కుటుంబాల సమక్షంలో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్
  • త్వరలోనే వివాహం?
టాలీవుడ్ ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ త్వరలో ఓ వ్యాపారవేత్తను పెళ్లాడబోతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి.  బెంగళూరుకు చెందిన బిలియనీర్ గౌతమ్ అనే వ్యక్తితో కాజల్‌కు నిశ్చితార్థమైందని, త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారన్న టాక్ టాలీవుడ్‌లో ప్రముఖ వార్త అయింది. ఈ సంబంధాన్ని తల్లిదండ్రులే చూశారని, ఇరు కుటుంబాల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ రహస్యంగా జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా, ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ దాదాపు 12 ఏళ్లు అయినా ఇంకా ప్రముఖ హీరోయిన్‌గా కొనసాగుతోంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని పలుమార్లు చెప్పిన కాజల్ కు ఆ సమయం ఇప్పుడు వచ్చేసిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.
Tollywood
Actress
Kajal Agarwal
Marriage

More Telugu News