హీరో సందీప్ కిషన్ నిర్మాతగా 'వివాహ భోజనంబు' సినిమా.. ప్రీలుక్ విడుదల!

Vivaha Bhojanambu movie prelook released
  • ఇప్పటికే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సందీప్
  • తాజాగా 'వివాహ భోజనంబు' సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం
  • రెస్టారెంట్ బిజినెస్ కూడా నిర్వహిస్తున్న సందీప్
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ లో ఒక బిజినెస్ మేన్ కూడా ఉన్నాడు. హీరోగా బిజీగా ఉంటూనే నిర్మాతగా మారాడు. తన సొంత బ్యానర్ వెంకటాద్రి టాకీస్ నిర్మాణంలో 'నిను వీడని నీడను నేనే' అనే చిత్రాన్ని నిర్మించాడు. దీనికి తోడు ఇప్పటికే రెస్టారెంట్ బిజినెస్ లోకి కూడా సందీప్ అడుగుపెట్టాడు. 'వివాహ భోజనంబు' పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెస్టారెంట్లను ప్రారంభించాడు.

తాజాగా నిర్మాతగా సందీప్ కిషన్ మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. 'వివాహ భోజనంబు' పేరుతో సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. వెంకటాద్రి టాకీస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కనుంది. దీనికి రామ్ అబ్బరాజు దర్శకుడు కాగా, జెమిని కిరణ్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన ప్రీలుక్ విడుదల చేశారు. త్వరలోనే నటీనటుల వివరాలను వెల్లడించనున్నారు. మరోవైపు  'ఏ1 ఎక్స్ ప్రెస్' చిత్రానికి కూడా సందీప్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
Go Back to Shorts
Sandeep Kishan
Tollywood
Vivaha Bhojanambu Movie

More Telugu News