ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇకపై డిజిటల్ చెల్లింపులు
- 35 శాఖల్లో 500 సేవలకు యూపీఐ ఆధారిత పేమెంట్
- 15,000కి పైగా గ్రామ/వార్డు సచివాలయాల్లో అమలు
- డిజిటల్ ఏపీ కోసం ప్రభుత్వం చర్యలు
ఈ విధానం ఎలా అమలవుతుందంటే... ఏదైనా గ్రామ/వార్డు సచివాలయానికి పౌరుడు వెళ్లినప్పుడు అతడు ఏ సేవల నిమిత్తం అక్కడికి వెళ్లాడో ఆ వివరాలను అక్కడి డిజిటల్ అసిస్టెంట్ సంబంధిత పోర్టల్ లో నమోదు చేస్తాడు. అప్పుడు ఆ సేవలకు పౌరుడు ఎంత చెల్లించాలో అంత మొత్తానికి ఓ యూపీఐ క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఆ క్యూఆర్ కోడ్ ను సదరు పౌరుడు తన ఫోన్ లోని ఏదైనా యూపీఐ ఆధారిత పేమెంట్ యాప్ ద్వారా చెల్లించవచ్చు. ఈ విధానం పూర్తి సురక్షితమని, సులభమని ఏపీ సర్కారు పేర్కొంటోంది.