IAF: నిన్న సాయంత్రం నుంచి భారీ వరద మధ్యే వ్యక్తి.. హెలికాఫ్టర్‌ తో వెళ్లి కాపాడిన ఐఏఎఫ్.. వీడియో ఇదిగో

iaf saves man s life
  • ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ సమీపంలో ఘటన 
  • ఓ చెట్టు కొమ్మను పట్టుకుని ఉండిపోయిన వ్యక్తి
  • నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు ఉదయం వరకు అక్కడే
దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కుండపోత వర్షాలకు చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో పలుచోట్ల రాకపోకలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ సమీపంలో ఖుతాఘాట్‌ ప్రాంతంలో భారీ వరదలో ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు.

వరదలో తనను తాను రక్షించుకోవటానికి ఓ చెట్టు కొమ్మను పట్టుకుని అలాగే ఉండిపోయాడు. నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు ఉదయం వరకు అక్కడే ఉన్నాడు. దీంతో హెలికాప్టర్లో అక్కడకు చేరుకున్న వైమానిక దళ సిబ్బంది తాడును కిందకు వదిలి అతడిని పైకి లాగి, కాపాడారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు తమ స్మార్ట్‌ఫోన్లలో చిత్రీకరించారు.
IAF
rains
Chhattisgarh

More Telugu News