ఎవరూ లేరనుకున్న సమయంలో నువ్వొచ్చావు... థాంక్యూ ధోనీ!: రామ్ చరణ్
- ఇంటర్నేషనల్ కెరీర్ కు గుడ్ బై చెప్పిన ధోనీ
- దేశం కోసం ప్రపంచాన్నే జయించావంటూ వ్యాఖ్యలు
- లైనప్ కు స్థిరత్వాన్ని తీసుకొచ్చావంటూ ట్వీట్
టాలీవుడ్ హిట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కూడా ధోనీ వీడ్కోలుపై వ్యాఖ్యానించారు. "నువ్వు మాకు వినోదాన్నిచ్చావు, మేం గర్వపడేలా చేశావు. అంతకంటే ఎక్కువగా, నరాలు తెగే ఒత్తిడిలో కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటూ మా అందరికీ స్ఫూర్తినిచ్చావు. కానీ నీ వీడ్కోలు క్షణాలను జీర్ణించుకోవడం కష్టమే. ధోనీ... రాబోయే తరాలకు కూడా నువ్వు మార్గదర్శి లాంటివాడివి" అంటూ తన అభిప్రాయాలు వెల్లడించారు.