Congress: నీటి కేటాయింపుల్లో ఒక్క చుక్క కూడా కోల్పోనివ్వం: ఉత్తమ్

Uttam Kumar Reddy fires on state and central Govts
  • గాంధీభవన్‌లో స్వాతంత్ర్య వేడుకలు
  • కేంద్రరాష్ట్రాలు ముందే మేల్కొని ఉంటే నేడు ఈ తిప్పలు ఉండేవి కావని వ్యాఖ్య
  • ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించాలి
కరోనా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా మేల్కొని ఉంటే ప్రజలు ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉండేవారు కాదని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో నిన్న నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కరోనాతో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారని, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఆరోగ్య భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి సంబంధించిన నీటి కేటాయింపుల్లో ఒక్క చుక్క కూడా కోల్పోకుండా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఉత్తమ్ అన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ, శ్రీధర్‌బాబు, సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Congress
Uttam Kumar Reddy
Telangana
Independence day

More Telugu News