Ankita Lokhande: నా ఫ్లాట్ కు ఈఎంఐలు చెల్లిస్తున్నది నేనే... సుశాంత్ కాదు!: అంకిత

Ankita Lokhande tells that she have been paying EMIs for flat
  • అంకితకు సుశాంత్ ఫ్లాట్ కొనిచ్చాడంటూ ప్రచారం
  • ఈఎంఐలు కూడా సుశాంతే చెల్లిస్తున్నట్టు కథనాలు
  • బ్యాంకు రసీదులు చూపించిన అంకిత
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం నేపథ్యంలో మాజీ ప్రియురాలు అంకిత లోఖండే పేరు కూడా బాగానే వినిపిస్తోంది. సుశాంత్ ఆమెకు రూ.4.5 కోట్ల విలువ చేసే ఫ్లాట్ కొనిచ్చాడని, దాని ఈఎంఐలు కూడా సుశాంతే చెల్లిస్తున్నాడని నిన్న ఈడీ వర్గాలు చెప్పినట్టు మీడియాలో వచ్చింది. ఈ కథనాలపై అంకిత లోఖండే స్పందించారు. తన ఫ్లాట్ కు తానే ఈఎంఐలు చెల్లిస్తున్నానని స్పష్టం చేశారు. తన ఫ్లాట్ కు సుశాంత్ ఈఎంఐలు చెల్లిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని తెలిపారు.

అంతేకాదు, ఫ్లాట్ రిజిస్ట్రేషన్ పత్రాలను, ఈఎంఐల తాలూకు బ్యాంకు రసీదులను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఆధారాలతో ఊహాగానాలకు స్వస్తి పలుకుతున్నానంటూ ట్వీట్ చేశారు. ప్రతి నెలా ఈఎంఐ రూపంలో బ్యాంకు వాళ్లు తన అకౌంట్ నుంచి కొంత మొత్తాన్ని మినహాయించుకుంటున్న రసీదులు కూడా ఆమె ప్రదర్శించారు. ఇంతకుమించి తాను చెప్పాల్సిందేమీ లేదని అంకిత పేర్కొన్నారు.

Ankita Lokhande
Sushant Singh Rajput
Flat
EMI
Bank

More Telugu News