Bahubali: మంగోలియా టీవీలో ప్రసారం అవుతున్న ప్రభాస్ సినిమా

Bahubali to be telecast on Mangolia TV

  • తెలుగు సినిమా సత్తాను చాటిన 'బాహుబలి'
  • ఇప్పటికే పలు భాషల్లోకి అనువాదం
  • తాజాగా మంగోలియన్ భాషలోకి డబ్బింగ్ 
  • రేపు అక్కడి TV-5లో ప్రసారం 

తెలుగు సినిమా స్టామినాకు ప్రతిరూపంగా నిలిచిన చిత్రం 'బాహుబలి'. తెలుగు సినిమా సత్తాను అంతర్జాతీయ వేదికపై చాటిన సినిమా అది. మన సినిమాకు అంతర్జాతీయంగా అవార్డులను తెచ్చిపెట్టిన చిత్రం. రాజమౌళి దర్శక ప్రతిభకు, నిర్మాణపు విలువలకు నిదర్శనంగా లిచింది. ఆ సినిమాతో హీరో ప్రభాస్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అతని మార్కెట్ వాల్యూ ఒక్కసారిగా పెరిగిపోయింది.

అంతటి సంచలనాలకు మారుపేరైన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువాదమై ఆయా దేశాల్లో ప్రదర్శితమైంది. తాజాగా ఈ చిత్రాన్ని మంగోలియా భాషలోకి కూడా అనువదించారు. మన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగోలియాలోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో జరిగే ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా ఈ చిత్రాన్ని అక్కడి TV-5లో రేపు (ఆగస్టు 16) ప్రదర్శిస్తున్నారు. ఆ దేశస్థులు తమ మాతృభాషలో ఆ విధంగా మన బాహుబలిని ఆస్వాదించనున్నారు. బాహుబలి జైత్రయాత్రలో ఇది కూడా భాగం కానుంది.  

  • Loading...

More Telugu News