Pranab Mukherjee: ఇంకా విషమంగానే ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి

The condition of exPresident Pranab Mukherjee remains unchanged this morning
  • న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స 
  • ఇప్పటికే ఆయనకు ఆపరేషన్
  • ఇంకా వెంటిలేటర్‌పైనే ప్రణబ్
ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. కరోనా సోకడంతో పాటు ఆయన మెదడుకు వెళ్లే నాళాల్లో రక్తం గడ్డకట్టడంతో ఆయనకు న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయనకు ఆపరేషన్ కూడా చేశారు.

అయితే, ఆయన ఆరోగ్యం ఇప్పటికీ విషమంగా ఉందని, ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందుతోందని ఆర్మీ ఆసుపత్రి ప్రకటించింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపింది. కాగా, ఆయన ఈ నెల 10 నుంచి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
Pranab Mukherjee
India
Corona Virus

More Telugu News