Kathi Mahesh: కత్తి మహేశ్ అరెస్టుతో .. 'రామ్ గోపాల్ వర్మ' సినిమా షూటింగ్ కు అంతరాయం!

Ram Gopal Varma movie shooting stopped due to Kathi Mahesh arrest
  • ప్రముఖ దర్శకుడిని ఉద్దేశిస్తూ తెరకెక్కుతున్న చిత్రం
  • కీలక పాత్రలు పోషిస్తున్న షకలక శంకర్, కత్తి మహేశ్
  • కత్తి మహేశ్ అరెస్టుతో ఆగిపోయిన షూటింగ్
సినీ క్రిటిక్, యాక్టర్ కత్తి మహేశ్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హిందువులు ఎంతో భక్తితో కొలిచే శ్రీరాముడిని కించపరిచేలా ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టినట్టు దర్యాప్తులో తేలడంతో ఆయనను అదుపులోకి  తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. కత్తి మహేశ్ అరెస్ట్ తో ఓ సినిమా షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది.

ప్రభు దర్శకత్వంలో 'రామ్ గోపాల్ వర్మ' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఓ ప్రముఖ దర్శకుడిని ఉద్దేశించి ఈ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో షకలక శంకర్ ప్రధాన పాత్రను పోషిస్తుండగా... కత్తి మహేశ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. కొన్ని రోజులుగా హైదరాబాదు సాగర్ సొసైటీలో ఉన్న డీఎస్ రావు బిల్డింగ్ లో షూటింగ్ జరుపుతున్నారు. కత్తి మహేశ్, షకలక శంకర్ లపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మహేశ్ అరెస్ట్ తో షూటింగ్ ఆగిపోయింది.
Kathi Mahesh
Arrest
Shakalaka Shankar
Ram Gopal Varma Movie
Shooting
Tollywood

More Telugu News