Ramajogaiah Shastri: దేవుడా... నా దేవుడి జోలికి రాకు: ఎస్పీ బాలు పరిస్థితిపై రామజోగయ్యశాస్త్రి ఆందోళన

Ramajogaiah Shastri responds on SP Balu critical situation
  • ఎస్పీ బాలు పరిస్థితి విషమం
  • ఇటీవలే కరోనా బారినపడిన బాలు
  • అందరం ఆ దిగ్గజం కోసం ప్రార్థిద్దాం అంటూ రామజోగయ్య ట్వీట్
కరోనా పాజిటివ్ వచ్చిన లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి విషమించడంతో ఆయనకు చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. దీనిపై ఆయన అభిమానులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ప్రముఖ టాలీవుడ్ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఎస్పీ బాలు పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. "దేవుడా... నా దేవుడి జోలికి రాకు" అంటూ ట్వీట్ చేశారు. "ఎస్పీబీ సర్ త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఆ దిగ్గజం కోలుకోవాలని మనందరం ప్రార్ధిద్దాం... నాతో కలవండి" అంటూ రామజోగయ్య శాస్త్రి విజ్ఞప్తి చేశారు.
Ramajogaiah Shastri
SP Balu
Critical
Corona Virus
Positive

More Telugu News