Anand Mahindra: ఈ వీడియోను భద్రపరిచి ప్రతి ఏడాది చూస్తుంటా: ఆనంద్ మహీంద్రా

Anand Mahindra shares another video which was mostly attracted him
  • జాతీయగీతం ఆలపించిన బాలుడు
  • ఎంతో అమాయకంగా, శ్రద్ధగా పాడాడన్న ఆనంద్ మహీంద్రా
  • ఆ వీడియో తనకు స్ఫూర్తి కలిగిస్తుందని వెల్లడి
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను సోషల్ మీడియాలో ఏదైనా అంశం ఆకర్షించిందంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది. తాజాగా ఆయన ఓ బాలుడు భారత జాతీయగీతం పాడుతున్న వీడియోను పంచుకున్నారు. అది తాను ఎప్పుడో చాన్నాళ్ల కిందట చూశానని, అప్పటినుంచి ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం ముందు ఆ వీడియో చూస్తుంటానని వెల్లడించారు. ఆ బాలుడు ఎంతో అమాయకంగా, ఎంతో ఏకాగ్రతతో జనగణమన పాడిన తీరు తనను విపరీతంగా ఆకట్టుకుందని వివరించారు. ఆ వీడియో ఎప్పుడు చూసినా తనకు ఎంతో స్ఫూర్తి కలిగిస్తుందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ఇప్పుడా బాలుడు పెద్దవాడై ఉంటాడని, ఒకవేళ ఇప్పుడు పాడితే మరికాస్త విభిన్నంగా పాడతాడేమో అని పేర్కొన్నారు.

Anand Mahindra
Video
National Anthem
Jana Gana Mana
India

More Telugu News