Sukhbir Singh Jaunapuria: బురదలో కూర్చుని ఇలా చేస్తే కరోనా నయమవుతుందట... ఓ బీజేపీ ఎంపీ సలహా!

BJP MP Jaunapuria advise on corona cure went viral
  • కరోనాపై బీజేపీ నేతల వింత సలహాలు
  • బురదలో కూర్చుని శంఖం ఊదాలంటున్న సుఖ్ బీర్ సింగ్ జౌనపురియా
  • వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వెల్లడి
దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక బీజేపీ నేతలు ఇస్తున్న సలహాలు, సూచనలు నవ్వులపాలవుతున్నాయి. ఆవు పంచకంతో కరోనా నయమవుతుందని, అప్పడాలు తింటే కరోనా దరిచేరదని పలువురు బీజేపీ నేతలు పేర్కొన్నారు. అప్పడాలు తింటే నయమవుతుందని చెప్పింది సాక్షాత్తు కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కాగా, తదనంతర కాలంలో ఆయన కూడా కరోనా బారినపడ్డారు. ఇప్పుడు రాజస్థాన్ కు చెందిన బీజేపీ ఎంపీ సుఖ్ బీర్ సింగ్ జౌనపురియా కూడా తనవంతుగా ఓ సలహా విసిరారు.

బురదలో కూర్చుని శంఖం ఊదితే కరోనా వ్యాధి నయమవుతుందని తెలిపారు. బురదలో కూర్చుని శంఖం ఊదితే ఇమ్యూనిటీ పెరుగుతుందని, తద్వారా కరోనాపై పోరాడే శక్తి వస్తుందని అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంపీ జౌనపురియా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గతంలో ఇదే ఎంపీ... వంటికి బురద పూసుకుని యోగా చేస్తే వ్యాధులు నయమవుతాయని చెప్పారు.
Sukhbir Singh Jaunapuria
Corona Virus
Cure
Mud
Cone
BJP MP
Rajasthan

More Telugu News