Brand Factory: బ్రాండ్ ఫ్యాక్టరీలో రెండు కొంటే మూడు ఉచితం... ముందుగా అపాయింట్ మెంట్ మాత్రం తప్పనిసరి!

Brand Factory Buy 2 Get 3 Offer
  • ఆగస్టు 16 వరకూ ఆఫర్లు
  • 200కు పైగా దేశ, విదేశీ బ్రాండ్లు సిద్ధం
  • వెల్లడించిన బ్రాండ్ ఫ్యాక్టరీ సీఈఓ
రేపటి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫ్యూచర్ గ్రూప్ అపెరల్ బ్రాండ్ చైన్ 'బ్రాండ్ ఫ్యాక్టరీ' మరోసారి అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించింది. తమ స్టోర్లలో 2 కొంటే మూడు ఉచితమని సంస్థ సీఈఓ సురేశ్ నద్వానీ వెల్లడించారు. ఈ ఆఫర్ 16వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుందని, కరోనా నేపథ్యంలో కస్టమర్ల భద్రత కోసం అసిస్టెడ్ షాపింగ్ విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టామని ఆయన అన్నారు. స్టోర్ కు రావాలంటే కస్టమర్లు 7606313001కి మిస్డ్ కాల్ ఇచ్చి, అపాయింట్ మెంట్ తీసుకోవడం తప్పనిసరని అన్నారు. ఆఫర్ లో భాగంగా 200కు పైగా దేశ, విదేశీ బ్రాండ్లను చౌక ధరకు అందిస్తున్నామని తెలిపారు.
Brand Factory
Buy 2 Get 3
Offer

More Telugu News