Bengaluru Riots: బెంగళూరు హింసాకాండ: కాంగ్రెస్ మాజీ మంత్రి కేజే జార్జ్ సన్నిహితుడు కలీంపాషా అరెస్ట్

Congress leader Kaleem pasha arrested in Bengaluru riots case
  • ఈ కేసులో ఇప్పటి వరకు 60 మంది అరెస్ట్
  • పోలీసుల అదుపులో 206 మంది
  • మాజీ సీఎం సిద్ధరామయ్యతో సన్నిహితంగా ఉన్న కలీంపాషా ఫొటో వైరల్
బెంగళూరు హింసాకాండకు సంబంధించిన కేసులో కాంగ్రెస్ నేత, బృహన్ బెంగళూరు మునిసిపల్ కార్పొరేషన్ (బీబీఎంసీ) నాగ్వారా వార్డు కార్పొరేటర్ ఇర్షాద్ బేగం భర్త కలీంపాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో 60 మందిని అరెస్ట్ చేశామని, 206 మందిని అదుపులోకి తీసుకున్నామని బెంగళూరు జాయింట్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు. ఈ కేసులో తాజాగా అరెస్ట్ అయిన కలీంపాషా మాజీ సీఎం సిద్ధరామయ్యతో కలిసి ఉన్న ఒకప్పటి ఫొటో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది. అలాగే, కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కేజే జార్జ్‌కు సన్నిహితుడని పోలీసులు తెలిపారు.
Bengaluru Riots
Congress
Kaleem pasha
Crime News

More Telugu News