Telangana: తెలంగాణలో 88 వేల మార్క్ దాటేసిన కొవిడ్ కేసులు

Covid cases in Telangana crossed 88 thousand mark
  • రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
  • 674కు పెరిగిన మృతుల సంఖ్య
  • 64,284కు పెరిగిన కోలుకున్న వారి సంఖ్య
తెలంగాణలో ప్రాణాంతక కరోనా వైరస్ జోరు కొనసాగుతోంది.  నిన్న ఒక్క రోజే ఏకంగా 1,921 మంది కొవిడ్ బారినపడడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 88 వేల మార్కును దాటేసింది. నిన్న 22,046 శాంపిళ్లు పరీక్షించగా 1,921 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ బాధితుల సంఖ్య 88,396కు పెరిగింది. ఇప్పటి వరకు 7,11,196 మందికి పరీక్షలు నిర్వహించారు. అలాగే, నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 9 మంది కరోనాతో మృతి చెందారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 674కు పెరిగింది.

గురువారం కొత్తగా 1,210 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 64,284కు పెరిగింది. రాష్ట్రంలో ఇంకా 23,438 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.  వీరిలో 16,439 మంది హోం/ వ్యవస్థాగత ఐసోలేషన్‌లో ఉన్నారు. నిన్న నిర్వహించిన పరీక్షలకు సంబంధించి 1,151 మంది ఫలితాలు రావాల్సి ఉంది.
Telangana
Corona Virus
Corona deaths

More Telugu News