ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ రాజధాని శంకుస్థాపన జరిగి తీరుతుంది.. మోదీని పిలుస్తాం!: బొత్స
- మన కుటుంబంలో ఫంక్షన్ జరిగితే అందరినీ పిలుస్తాం
- అలాగే అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వానిస్తాం
- అమరావతిని కూడా అభివృద్ది చేసి చూపిస్తాం
అమరావతిలో పెండింగ్ పనులపై దృష్టి సారించామని బొత్స చెప్పారు. అమరావతి రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని తెలిపారు. అంతేకాని, ఆర్థిక పరిస్థితిని చూసుకోకుండా, ఆర్బాటాలకు పోయి, అప్పులు తెచ్చుకుంటూ అమరావతిని నిర్మించలేమని చెప్పారు. చంద్రబాబుకు స్వప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. ప్రతిపక్ష పాత్రను పోషించడంలో టీడీపీ విఫలమైందని చెప్పారు. అధికారపక్షం, ప్రతిపక్షం రెండు పాత్రలను తామే పోషించుకుంటూ, న్యాయస్థానాలకు లోబడి ముందుకు వెళ్తున్నామని తెలిపారు. నిజం, నిజాయతీనే ఎప్పటికీ నిలుస్తాయని చెప్పారు.