Prabhas: ప్రభాస్ తో యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్న 'కేజీఎఫ్' దర్శకుడు!

Prashanth Neil plans action thriller with Prabhas
  • ప్రస్తుతం 'కేజీఎఫ్'కి సీక్వెల్ చేస్తున్న ప్రశాంత్ నీల్ 
  • తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో ప్లానింగ్
  • ఇటీవల ప్రభాస్ ని కలసి చర్చించిన ప్రశాంత్     
'కేజీఎఫ్' సినిమాతో దేశ సినీ రంగంలో ఓ సంచలనం సృష్టించిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఏదైనా పాయింట్ ను కొత్త తరహాగా చెబితే ఆ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనడానికి నిదర్శనం కేజీఎఫ్. ఆ సినిమాతో ఈ దర్శకుడు ఒక్కసారిగా అందర్నీ తనవైపు తిప్పుకున్నాడు. దాంతో ప్రశాంత్ కు ఆఫర్ల వెల్లువ వచ్చింది. ఆయనతో సినిమా చేయాలని పలువురు మాస్ హీరోలు కోరుకున్నారు. అయితే, ప్రస్తుతం 'కేజీఎఫ్'కి సీక్వెల్ చేస్తున్న ప్రశాంత్ తన తదుపరి చిత్రాలను తెలుగు హీరోలతో ప్లాన్ చేసుకుంటున్నాడు. టాలీవుడ్ హీరోలతో ఆయన రెండు సినిమాలు చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి.

వీటిలో ముందుగా ఎన్టీఆర్ తో చేసే సినిమా ఒకటి కాగా, మరొకటి ప్రభాస్ తో చేసే చిత్రం. ఎన్టీఆర్ తో ఇటీవల చర్చలు జరిపిన దర్శకుడు ప్రశాంత్.. తాజాగా ప్రభాస్ తో కూడా ప్రాజక్టు గురించి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ప్రభాస్ కోసం ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ కథను ప్రశాంత్ సిద్ధం చేస్తున్నాడట. ఈ విషయంపైనే ఇటీవల ప్రభాస్ తో ఈ దర్శకుడు మాట్లాడినట్టు తెలుస్తోంది. తాను ఎన్టీఆర్ తో చేసిన చిత్రం తర్వాత ఈ చిత్రం సెట్స్ కి వెళుతుందని అంటున్నారు. అప్పటికి ప్రభాస్ ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తాడు.  
Prabhas
Prashanth Neil
NTR

More Telugu News