Bengaluru: బెంగళూరు నుంచి విజయవాడ వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలను నిర్వహించం: ఏపీ అధికారులు

No corona tests for passengers coming from Bengaluru to Vijayawada announces AP officials
  • లాక్ డౌన్ సడలింపుల క్రమంలో మరో నిర్ణయం
  • ఇకపై స్వాబ్ టెస్టులు చేయబోమని ప్రకటన
  • నేరుగా స్వస్థలాలకు వెళ్లొచ్చన్న అధికారులు
లాక్ డౌన్ నిబంధనలను సడలించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు నుంచి విజయవాడకు వచ్చే ప్రయాణికులకు కరోనా టెస్టులను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇకపై స్వాబ్ టెస్టులు చేయబోమని తెలిపారు. బెంగళూరు నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా వారి స్వస్థలాలకు వెళ్లొచ్చని చెప్పారు. గతంలో రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, చెక్ పోస్టుల వద్ద స్వాబ్ టెస్టులు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలో దిగిన ప్రయాణికులందరికీ కోవిడ్ టెస్టులు నిర్వహించారు. తాజా నిర్ణయంతో... బెంగళూరు నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా వాళ్ల ఇళ్లకు వెళ్లొచ్చు.
Bengaluru
Vijayawada
Passengers
Corona Virus
tests

More Telugu News