Sunkara Padmasri: మోదీ ఏ ముఖం పెట్టుకుని మరో రాజధాని శంకుస్థాపనకు వస్తారు?: సుంకర పద్మశ్రీ

How do modi come to Vizag capital inauguration questions Sunkara Padmasri
  • అమరావతికి మోదీ శంకుస్థాపన చేశారు
  • శంకుస్థాపనకు రావడానికి మోదీకి సిగ్గుండాలి  
  • ఒక వ్యక్తి మీద కోపంతో అమరావతిని నాశనం చేస్తున్నారు
విశాఖ రాజధాని ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. రాజధాని శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మోదీపై కాంగ్రెస్ నాయకురాలు, అమరావతి మహిళా జేఏసీ నాయకురాలు సుంకర పద్మశ్రీ ఫైర్ అయ్యారు. విశాఖ రాజధాని శంకుస్థాపనకు రావడానికి మోదీకి సిగ్గుండాలని అన్నారు. అమరావతికి శంకుస్థాపన చేసిన మోదీ... ఏ ముఖం పెట్టుకుని మరో రాజధాని శంకుస్థాపనకు వస్తారని మండిపడ్డారు.

కేవలం ఒక వ్యక్తిపై ఉన్న కోపంతో అమరావతిని నాశనం చేస్తున్నారని పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు కన్నీరు పెడుతున్నా అమరావతిని మోదీ, జగన్ హత్య చేస్తున్నారని మండిపడ్డారు. మూడు రాజధానులకు కోర్టుల్లో అడ్డుకట్ట పడుతుందనే నమ్మకం తమకుందని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఏపీకి మూడు రాజధానులను ఎలా పెడుతున్నారో... అదే విధంగా దేశానికి రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీ చాలా రాష్ట్రాలకు దూరంగా ఉందని... ఈ నేపథ్యంలో దక్షిణాదిన రెండో రాజధానిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
Sunkara Padmasri
Narendra Modi
Jagan
BJP
YSRCP
Congress
Amaravati

More Telugu News