రష్యా వ్యాక్సిన్ పై ఇప్పుడే ఓ అంచనాకు రాలేం: ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్
- కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తికి సిద్ధమయ్యామంటూ రష్యా ప్రకటన
- తన కుమార్తెకు కూడా వ్యాక్సిన్ ఇప్పించామన్న పుతిన్
- ఇది ఏ మేరకు సురక్షితమో చెప్పలేమన్న ఎయిమ్స్ డైరెక్టర్
రష్యాలోని గమాలేయా ఇన్ స్టిట్యూట్ తయారుచేసిన వ్యాక్సిన్ అన్ని దశలు దాటి, ఉత్పత్తికి సిద్ధమైందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించడం అన్ని దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన తన కుమార్తెకు కూడా వ్యాక్సిన్ ఇప్పించామని తెలిపారు. కరోనా వంటి క్లిష్టమైన వైరస్ ను కట్టడి చేసే వ్యాక్సిన్ ఇంత త్వరగా రావడం పట్ల సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.