Chandrababu: 'ఈ విద్యార్థికి న్యాయం చేయాలి' అంటూ వీడియో పోస్ట్ చేసిన చంద్రబాబు

do justice to ap student mahesh demands chandrababu
  • ప్రాథమిక హక్కులను ఏపీలో కాలరాస్తున్నారు 
  • ఆంధ్ర వర్సిటీ దళిత విద్యార్థి చ‌దువుకి ఆటంకాలు
  • ఇది విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే
  • ఈ విధమైన క‌క్ష‌సాధింపు గర్హనీయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు.  ఆంధ్ర విశ్వ‌విద్యాల‌య దళిత విద్యార్థి, రీసెర్చ్ స్కాలర్ ఆరేటి మ‌హేశ్ నిరసనకు దిగాడని, ఆయనకు న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

'రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ భారత పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఏపీలో కాలరాస్తున్నారు. ఆంధ్ర విశ్వ‌విద్యాల‌య దళిత విద్యార్థి, రీసెర్చ్ స్కాలర్ ఆరేటి మ‌హేశ్ ఉన్నత చ‌దువులకు.. ఆటంకాలు కల్పించడం విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే. ఈ విధమైన క‌క్ష‌సాధింపు గర్హనీయం' అని విమర్శించారు.
 
'ద‌ళితుల చదువుకు అడ్డుపడటం ఫ్యాక్షనిస్టుల దుష్ట సంస్కృతి. దళిత వైద్యులపై అమానుషాలు, దళిత జడ్జిపై రాళ్లదాడి, దళిత ఆడబిడ్డలపై అత్యాచారాలు, దళితుల భూములు బలవంతంగా లాక్కోవడం.. వంటి ఈ పాలకుల గతితప్పిన, మతిమాలిన చర్యలను దళిత సమాజమే నిగ్గదీయాలి. నిరాహార దీక్ష చేస్తున్న మ‌హేశ్‌కి తక్షణమే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను' అని చంద్రబాబు పేర్కొన్నారు.
Chandrababu
Telugudesam
Andhra Pradesh

More Telugu News