Corona Virus: దేశంలో 23 లక్షలు దాటేసిన కరోనా కేసులు

Single day spike of 60963 cases
  • 24 గంటల్లో 60,963 మందికి కరోనా
  • మొత్తం కేసులు 23,29,639
  • మృతుల సంఖ్య మొత్తం 46,091
  • 6,43,948 మందికి ఆసుపత్రుల్లో చికిత్స  
దేశంలో కరోనా ఉద్ధృతి రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. భారత్‌లో 24 గంటల్లో 60,963 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో  834 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.  
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 23,29,639 కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 46,091 కి పెరిగింది. 6,43,948 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 16,39,600 మంది కోలుకున్నారు.
                                                 
కాగా, నిన్నటి వరకు మొత్తం 2,60,15,297 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 7,33,449 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.
Corona Virus
COVID-19
India

More Telugu News