Ileana: ఫిట్ నెస్ కోసం కష్టపడుతున్న ఇల్లీ బ్యూటీ!

Ileana now focus on fitness
  • ఫొటోగ్రాఫర్ తో ప్రేమలో పడ్డ ఇలియానా 
  • కొన్నాళ్లకు ఆండ్రూ నీబోన్ తో బ్రేకప్
  • అవకాశాల కోసం మళ్లీ ప్రయత్నాలు
  • ఎనభై రోజుల ఫిట్ నెస్ ఛాలెంజ్ స్వీకరణ
సినిమాల్లో చూపించినట్టు ప్రేమ అనేది ఎంతటి వాళ్లనైనా మార్చేస్తుంది. అందులో పడితే సర్వం మరిచిపోతారు. గోవా బ్యూటీ ఇలియానా పరిస్థితి కూడా ఆమధ్య అలాగే అయ్యింది. బాలీవుడ్ లో కెరీర్ మంచి ఊపులో వున్న సమయంలో ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ ప్రేమలో పడింది. కొన్నాళ్లు కెరీర్ని పక్కన పెట్టేసి అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. అయితే, కొన్నాళ్ల తర్వాత ఉన్నట్టుండి అతనితో బ్రేకప్ అయినట్టు ప్రకటించింది. ఆ హ్యంగోవర్ నుంచి బయటపడడానికి అమ్మడికి చాలా కాలమే పట్టింది. ఈ లోగా కెరీర్ దెబ్బతింది.

ఇప్పుడు మళ్లీ కెరీర్ మీద దృష్టి పెట్టాలని ఇలియానా భావించినప్పటికీ, శరీరంలో వచ్చిన మార్పు కారణంగా అవకాశాలు రావడం లేదు. దాంతో ఇప్పుడు ఫిట్ నెస్ మీద దృష్టి పెడుతోంది. ఈ క్రమంలో బాడీ షేప్ కోసం కష్టపడుతోంది. ఈ క్రమంలో ఎనభై రోజుల ఫిట్ నెస్ ఛాలెంజ్ ను తీసుకున్నానని అంటోంది. ఇలా వర్కౌట్స్ చేయడం మొదట్లో చాలా కష్టమనిపించినా, మెల్లగా అలవాటుపడ్డానని, ఇప్పుడు వ్యాయామం చేయనిదే వుండలేకపోతున్నానని, అదొక వ్యసనంలా తయారైందనీ చెబుతోంది. మరి, ఇప్పుడైనా అమ్మడికి అవకాశాలు వస్తాయేమో చూద్దాం.  
Ileana
Photographer
Andrew Kneebone

More Telugu News