Danish Kanaria: అయోధ్య రామాలయాన్ని దర్శించుకుంటానన్న పాకిస్థాన్ క్రికెటర్

If I get an opportunity I will come to Ayodhya says Pak cricketer Danish Kaneria
  • అయోధ్య భూమిపూజపై సంతోషం వ్యక్తం చేసిన డానిష్ కనేరియా
  • తాను ఒక హిందువునని ట్వీట్
  • రాముడి మార్గంలో నడిచేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తానని వ్యాఖ్య
అయోధ్య రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరగడంపై పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా సంతోషం వ్యక్తం చేశాడు. భూమిపూజ జరిగిన ఆగస్ట్ 5వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు ఆనందకరమైన దినమని చెప్పాడు. అయోధ్య అనేది మతపరమైన గొప్ప ప్రదేశమని తెలిపాడు. తనకు అవకాశం లభిస్తే తప్పకుండా అయోధ్యకు వస్తానని చెప్పాడు. తాను ఒక హిందువునని... రాముడు చూపించిన మార్గంలో నడిచేందుకు తాను ఎప్పుడూ ప్రయత్నిస్తానని ట్వీట్ చేశాడు.

డానిష్ కనేరియా ట్వీట్ పట్ల పలువురు నెటిజెన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయనకు తగు జాగ్రత్తలు కూడా చెపుతున్నారు. ఇలాంటి ట్వీట్ చేసిన తర్వాత అప్రమత్తంగా ఉండాలని... పాకిస్థాన్ లో ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Danish Kanaria
Pakistan
Cricketer
Ayodhya Ram Mandir

More Telugu News