NTR: ఎన్టీఆర్ ని కలసి కథపై చర్చించిన కన్నడ దర్శకుడు

Prashanth Neil met NTR and narrated story
  • 'కేజీఎఫ్'తో పేరుతెచ్చుకున్న ప్రశాంత్ 
  • ఇటీవల ఎన్టీఆర్ ని కలసిన వైనం 
  • త్వరలో మరోసారి కలవనున్న ప్రశాంత్ 
  • త్రివిక్రమ్ సినిమా తర్వాత సెట్స్ పైకి 
ఎన్టీఆర్ లాంటి టాలెంటెడ్.. మాస్ హీరోతో సినిమా చేయాలని చాలా మంది దర్శకులకు ఆశగా వుంటుంది. ప్రశాంత్ నీల్ కు కూడా అలాంటి ఆశే వుంది. 'కేజీఎఫ్' సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పేరుతెచ్చుకున్న ప్రశాంత్, ప్రస్తుతం 'కేజీఎఫ్ 2' చిత్రాన్ని చేస్తున్నాడు. మరోపక్క, ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఈయన ప్రయత్నిస్తున్నాడని చాలాకాలం నుంచి వార్తలొస్తున్నాయి.

ఈ క్రమంలో ఈ లాక్ డౌన్ కాలంలో ఇటీవల ఎన్టీఆర్ ను కలసి ప్రశాంత్ కథ చెప్పాడని తెలుస్తోంది. ఈ విషయంలో మరోసారి ఇద్దరూ కలసి కథపై చర్చించుకోవడం జరుగుతుందని అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పాన్ ఇండియా చిత్రంగా నిర్మించడానికి ముందుకువచ్చింది. భారీ బడ్జెట్టుతో రూపొందే ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ బల్క్ డేట్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా వున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం తాను చేస్తున్న 'ఆర్ఆర్ఆర్' పూర్తయిన వెంటనే, త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తాడు. దాని తర్వాత ప్రశాంత్ సినిమా మొదలవుతుందట.  
NTR
Prashanth
KGF
RRR

More Telugu News