KCR: అయ్య కయ్యమంటుంటే, కొడుకు దోస్తులమంటున్నాడు: రేవంత్ రెడ్డి

Revant Reddy Setires on KCR and KTR
  • మందికి మస్కా కొట్టడంలో ఆరితేరారు
  • కేసీఆర్, కేటీఆర్ వార్తల క్లిప్పింగ్స్ పోస్ట్ చేసిన రేవంత్
  • కృష్ణా జలాల వినియోగంపై ఏపీతో విభేదిస్తున్న కేసీఆర్
  • జగన్ తమకు మంచి మిత్రుడన్న కేటీఆర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఉన్న సంబంధాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకలా, ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ మరోలా వ్యాఖ్యానించినట్టున్న వార్తా పత్రికల క్లిప్పింగ్స్ ను పోస్ట్ చేస్తూ, రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, తన ట్విట్టర్ ఖాతాలో సెటైర్లు వేశారు.

"ఏందీ డ్రామాలు? అయ్య కయ్యం అంటాడు... కొడుకు దోస్తులమంటాడు... మందికి మస్కా కొట్టడంలో ఆరితేరారు" అంటూ ట్వీట్ చేశారు. కాగా, తాను స్నేహ హస్తం అందిస్తే, ఏపీ సర్కారు కయ్యం పెట్టుకుంటోందని నిన్న కేసీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కృష్ణా జలాల వినియోగంపై ఏపీతో కేసీఆర్ విభేదిస్తున్నారు. ఇదే సమయంలో తమకు జగన్ తో మంచి సంబంధాలు ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
KCR
KTR
Revanth Reddy
Jagan]
Twitter

More Telugu News