Sabitha Indrareddy: తెలంగాణలో ఎంసెట్ ప్రతిపాదిత తేదీలను వెల్లడించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Sabitha Indrareddy says EAMCET will be conducted in September
  • సెప్టెంబరు 9 నుంచి 14వ తేదీ మధ్యలో ఎంసెట్
  • సెప్టెంబరు 1 తర్వాత ఇంటర్ అడ్మిషన్లు
  • హైకోర్టు అనుమతి వస్తే ఎంట్రన్సు పరీక్షలు నిర్వహిస్తామన్న అధికారులు
కరోనాతో విద్యావ్యవస్థలు స్తంభించిపోయిన నేపథ్యంలో విద్యార్థుల్లో నిస్తేజం కలగకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. ముఖ్యంగా ఎంసెట్ నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలని భావిస్తోంది. సెప్టెంబరు 9, 10, 11, 14వ తేదీ మధ్యలో ఎంసెట్ నిర్వహించాలని భావిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఆగస్టు 31న ఈసెట్, సెప్టెంబరు 2న పాలిసెట్ ఉంటుందని తెలిపారు. దీనిపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి మాట్లాడుతూ, హైకోర్టు నుంచి అనుమతి వస్తే ఎంట్రెన్సు పరీక్షలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

అటు, విద్యాసంవత్సరంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, సెప్టెంబరు 1 తర్వాత ఇంటర్ అడ్మిషన్లు చేపడతామని వెల్లడించారు. ఆగస్టు 17 నుంచి సెకండియర్ ఇంటర్ విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు.
Sabitha Indrareddy
EAMCET
Telangana
Inter
Corona Virus

More Telugu News