Mumbai: ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న ముంబై ట్రాఫిక్ పోలీసులు!

  • లింగ సమానత్వాన్ని తెలిపేలా సిగ్నల్స్
  • పురుషుల సింబల్ స్థానంలో మహిళ సింబల్
  • భారత్ నుంచి శుభవార్త వచ్చిందన్న యూఎన్ ఉమెన్
Mumbai Traffic Women Icons get Global Prise

లింగ సమానత్వాన్ని చూపుతూ, ట్రాఫిక్ సిగ్నల్స్ పై మహిళల సింబల్ ను ఏర్పాటు చేస్తూ, ముంబై ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. నగరవ్యాప్తంగా 120 సిగ్నల్స్ వద్ద అధికారులు మహిళల సింబల్స్ ను ఏర్పాటు చేశారు. దాదర్, జీ నార్త్ వార్డ్ తదితర ప్రాంతాల్లో పురుషుల సిగ్నల్ బదులుగా మహిళలను సూచించే లైట్లు ఏర్పాటు చేయడాన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. బీఎంసీ (బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్) కల్చరల్ ప్రాజెక్టులో భాగంగా ఈ మార్పు చేశారు. పలు దేశాలు ముంబై తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు స్వాగతిస్తూ, తమ దేశాల్లోనూ అదే విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నాయి.

"నేను దాదర్ ప్రాంతంలో వెళుతుంటే, లింగ సమానత్వాన్ని తెలిపే సింబల్ చూశాను. ఎంతో గర్వంగా అనిపించింది" అని మహారాష్ట్ర టూరిజం మంత్రి ఆదిత్య థాక్రే వ్యాఖ్యానించారు. "ఓ శుభవార్త. ముంబైలో ట్రాఫిక్ లైట్లను మార్చారు. లింగ సమానత్వం దిశగా ఇండియా మరో అడుగు వేసింది" అని యునైటెడ్ నేషన్స్ ఉమెన్ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించింది.

More Telugu News