Chalamalasetti Sunil: నేడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న చలమలశెట్టి సునీల్

Chalamalasetti Sunil Joining Ysrcp Today
  • 2019లో వంగా గీత చేతిలో పరాజయం
  • అప్పటి నుంచి టీడీపీకి దూరంగా సునీల్
  • 2022లో ఖాళీ అయ్యే రాజ్యసభ సీటుపై కన్ను!
2019 లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి, వంగా గీత చేతిలో ఓటమిపాలైన చలమలశెట్టి సునీల్, నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మధ్యాహ్నం సునీల్, పార్టీ అధినేత జగన్ ను కలిసి, వైసీపీ కండువాను కప్పుకోనున్నారు. కాగా, గత ఎన్నికల్లో ఓటమి అనంతరం చలమలశెట్టి సునీల్, టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. 2022లో ఏపీ నుంచి కొన్ని రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండటంతో తనకు అవకాశం కల్పించాలని కోరుతూ, వైసీపీ అగ్ర నేతలతో ఇటీవలి కాలంలో సునీల్ మంతనాలు జరిపినట్టు సమాచారం.
Chalamalasetti Sunil
Ysrcp
Jagan
Telugudesam

More Telugu News