Kodali Nani: ఇండియాలో పుట్టిన కరోనా మరొకటుంది... చంద్రబాబు దాని మీదకి ఎగబడ్డారు: కొడాలి నాని

AP Minister Kodali Nani terms BJP as corona virus
  • బీజేపీని కరోనాతో పోల్చిన కొడాలి నాని
  • అడ్డొస్తే కబళించివేస్తుందని వెల్లడి
  • కానీ వైసీపీని ఏంచేయలేదని ధీమా
వైసీపీ మంత్రి కొడాలి నాని మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో పుట్టిన కరోనా వైరస్ ఒకటుందని, దాని పేరు బీజేపీ అని అన్నారు. ఇది చాలా ప్రమాదకరమైనదని, పశ్చిమ బెంగాల్ లో కమ్యూనిస్టులను, కాంగ్రెస్ వాళ్లను కలిపి తినేస్తోందని తెలిపారు. ఒడిశాలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీని తినేసిందని, త్రిపురలో కాంగ్రెస్ పార్టీని భోంచేస్తోందని వెల్లడించారు. బీజేపీ కరోనాకు ఆ పార్టీ ఈ పార్టీ అనే భేదం లేదని, దానికి తగులుకుంటే చాలు స్వాహా చేస్తుందని వివరించారు.

"ఈ బీజేపీ కరోనా ఏపీకి కూడా వచ్చేసింది. మాస్కులు అవీ ధరించి దానితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నికల ముందు చంద్రబాబు అన్నీ తీసేసి దానిపైకి ఎగబడ్డాడు. కానీ వాళ్లెందుకు వదులుతారు? ఓ వైపు నుంచి పార్టీని కబళించేందుకు సిద్ధంగా ఉన్నారు. వైసీపీని అలాంటి కరోనాలు ఏమీ చేయలేవు" అని వివరించారు. అంతకుముందు, చంద్రబాబు గురించి చెబుతూ, వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా ఆయన కరోనా వైరస్ అంటే భయపడుతూ, నాలుగ్గోడల మధ్య బందీ అయిపోయారని విమర్శించారు. లేఖలు రాయడం, జూమ్ కెమెరా ముందు సొల్లు చెప్పడంతో సరిపోతోందని ఎద్దేవా చేశారు.
Kodali Nani
BJP
Corona Virus
Chandrababu
YSRCP
Andhra Pradesh

More Telugu News