Chiranjeev Rao: మహేశ్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన హర్యానా ఎమ్మెల్యే చిరంజీవ్ రావ్

Rewari congress MLA Chiranjeev Rao wishes Mahesh Babu
  • నేడు మహేశ్ బాబు జన్మదినం
  • సూపర్ స్టార్ పై శుభాకాంక్షలు జడివాన
  • కోట్లాది ప్రజల గుండె చప్పుడు అంటూ వర్ణించిన ఎమ్మెల్యే
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఖ్యాతి యావత్ దేశానికి విస్తరించింది. తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ శాసనసభ్యుడు విషెస్ తెలిపారు. నేడు మహేశ్ బాబు 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరంజీవ్ రావ్ ట్విట్టర్లో స్పందించారు. "సూపర్ స్టార్ మహేశ్ బాబుకు హ్యాపీ బర్త్ డే. కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు, ముఖ్యంగా దక్షిణాది ప్రజలకు ఆరాధ్య హీరో" అంటూ పేర్కొన్నారు.

మహేశ్ బాబు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నానని తెలిపారు. హర్యానాలోని రేవారి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన చిరంజీవ్ రావ్... భారత యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగానూ వ్యవహరిస్తున్నారు. అయితే, చిరంజీవ్ రావ్ కు మహేశ్ బాబు ఎలా తెలుసన్నదానిపై స్పష్టత లేదు. అయితే, తనకు శుభాకాంక్షలు తెలుపుతూ హర్యానా ఎమ్మెల్యే చేసిన ట్వీట్ కు మహేశ్ బాబు కూడా లైక్ కొట్టారు.

Chiranjeev Rao
Mahesh Babu
Birthday
MLA
Rewari
Haryana
Congress

More Telugu News