Jammu And Kashmir: మార్నింగ్ వాక్ కు వెళ్లిన బీజేపీ నేతపై కాల్పులు!

Terrorist Fire on Bjp Leader
  • బుద్గాంలో ఘటన
  • హమీద్ నాజర్ పై కాల్పులు
  • జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన హమీద్
భారతీయ జనతా పార్టీకి చెందిన నేతపై జమ్మూకశ్మీర్  పరిధిలోని బుద్గాంలో దాడి జరిగింది. అబ్దుల్ హమీద్ నాజర్ అనే బీజేపీ నేత, ఈ ఉదయం మార్నింగ్ వాక్ కు వెళ్లిన సమయంలో ఓమ్ పోరా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారని, వెంటనే బాధితుడిని శ్రీ మహరాజా హరిసింగ్ హాస్పిటల్ కు తరలించామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

కాగా, 38 సంవత్సరాల హమీద్ నాజర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. గడచిన ఐదు రోజుల వ్యవధిలో బీజేపీ నాయకులపై జరిగిన మూడో దాడి ఇది. ఇటీవల దక్షిణ కశ్మీర్ లోని క్వాజీగుండ్ లో ఓ సర్పంచ్ ని దారుణంగా చంపిన సంగతి తెలిసిందే. ఆ తరువాత సజ్జాద్ అహ్మద్ అనే మరో నేతను అతని ఇంటి బయటే కాల్చగా, ఆసుపత్రికి తరలించే లోపే అతను కన్నుమూశారు. ఆపై ఆరిఫ్ అనే మరో సర్పంచ్ ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు.
Jammu And Kashmir
Hamid Nazar
Firing

More Telugu News