Corona Virus: మరో ఇద్దరు కేంద్ర మంత్రులకు కరోనా పాజిటివ్

Another Two Central Ministers Tested Corona Positive
  • ఇప్పటికే అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ లకు పాజిటివ్
  • తాజాగా అర్జున్ రామ్ మేఘ్ వాల్, కైలాశ్ చౌదరికి సోకిన వైరస్
  • ఎయిమ్స్ లో మేఘ్ వాల్ కు చికిత్స
ఇప్పటికే ఇద్దరు కేంద్ర మంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ లకు కరోనా మహమ్మారి సోకగా, తాజాగా మరో ఇద్దరు కేంద్ర మంత్రులను వైరస్ పట్టుకుంది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌ వాల్ కరోనా బారిన‌ప‌డ్డారు. ఆయనతో పాటు వ్యవసాయ శాఖ సహాయమంత్రి కైలాశ్ చౌదరికి కూడా కొవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం అర్జున్ రామ్ మేఘ్ వాల్ ట్రామా సెంటర్ ఆఫ్ ఎయిమ్స్ లో చేర్చగా, కైలాశ్ చౌదరి జైపూర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మేఘ్ ‌వాల్ ‌కు తేలికపాటి ఇన్ ‌ఫెక్షన్ మాత్రమే ఉందని తెలుస్తోంది.
Corona Virus
Arjunram Meghawal
Kailash Chowdary
Amit Shah

More Telugu News