Srikakulam District: ఎన్నేళ్లదో,ఎలా వచ్చిందో... శ్రీకాకుళం జిల్లాలో కొండపై పుట్టలో నీలిరాతి అయ్యప్ప!

Blue Stone Ayyappa Idol on Hill
  • పుట్ట గొడుగుల కోసం పుట్టను తవ్విన గ్రామస్థులు
  • పుట్టలో కనిపించిన అయ్యప్ప విగ్రహం
  • తమ గ్రామంలో వెలిశాడంటూ ఆనందం
ఎన్ని సంవత్సరాల నాటిదో తెలియదు. ఎవరు తెచ్చి పెట్టారో తెలియదు. కొండపై అయ్యప్ప నీలిరాతి విగ్రహం లభించడం అక్కడి ప్రజల్లో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలో జరిగింది. ఇక్కడి కోదడ్డపనస గ్రామంలో ఉన్న కొండపై పుట్టలో అయ్యప్ప అరుదైన విగ్రహం దొరికింది.

గ్రామ వాసులు కొందరు పుట్టగొడుగుల కోసం కొండపై ఉన్న పెద్ద పుట్టను తవ్వారు. దానిలో వారికి నీలిరాతితో చెక్కబడిన అయ్యప్ప విగ్రహం కనిపించింది. దీంతో వారంతా గ్రామస్థులకు విషయం చెప్పి, నిన్న పుట్టను పూర్తిగా తొలగించడంతో విగ్రహం ఆసాంతం బయటపడింది. అయ్యప్ప తమ గ్రామంలో వెలిశాడని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Srikakulam District
Ayyappa
Idol

More Telugu News