Somu Veerraju: యోగి ఆదిత్య‌నాథ్ కు జ‌గ‌న్ లేఖ రాయాలి: సోము వీర్రాజు

jagan has to write letter to yogi somu veerraju
  • ఏపీ నుంచి  అయోధ్యకు వెళ్లే భ‌క్తుల‌కు వ‌స‌తి ఉండాలి
  • వసతి గృహ నిర్మాణానికి రెండు ఎకరాల భూమి కావాలి
  • భూమిని కేటాయించమని కోరుతూ లేఖ రాయాలి
  • క‌ర్ణాటక సీఎం ఇప్ప‌టికే రాశారు
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని  అయోధ్య‌లో రామాల‌య నిర్మాణానికి ఇటీవ‌లే భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. రామాల‌య నిర్మాణం, అక్క‌డ భ‌క్తుల‌కు వ‌స‌తిపై అన్ని ప్ర‌ణాళిక‌లు వేసుకుంటోన్న నేప‌థ్యంలో  అక్క‌డ ఏపీ యాత్రికుల కోసం వ‌స‌తి  గృహ నిర్మాణం కోసం చొర‌వ‌చూపాల‌ని ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ను బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు కోరారు.

"ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి  అయోధ్యకు శ్రీరాముని దర్శనాని కోసం వెళ్లే యాత్రికుల కోసం వసతి గృహ నిర్మాణానికి రెండు ఎకరాల భూమిని కేటాయించమని కోరుతూ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ గారికి జగన్ గారు లేఖ రాయాలి.  కర్ణాటక యాత్రికుల కోసం ఈ వ్యవస్థ‌ ఏర్పాటు కోసం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రికి లేఖ రాసిన క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి యె‌డియూర‌ప్ప  గారిని నేను అభినందిస్తున్నాను" అని ఆయ‌న పేర్కొన్నారు.
Somu Veerraju
BJP
Jagan
Ayodhya Ram Mandir

More Telugu News