Prashanth Varma: ప్రశాంత్ వర్మ కరోనా సినిమా 'జాంబీ రెడ్డి'

Prashanth Varma new film Zombie Reddy
  • ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మూడో చిత్రం 
  • కరోనా మహమ్మారి నేపథ్యంలో సాగే కథ
  • తెలుగులో తొలి జాంబీ సినిమా ఇదే!
గత కొన్నాళ్లుగా ప్రపంచాన్ని గజగజలాడిస్తూ.. మృత్యు ఘోష వినిపిస్తున్న కరోనా మహమ్మరి నేపథ్యంలో తెలుగులో ఓ చిత్రం రూపొందుతోంది. గతంలో 'అ!', 'కల్కి' చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ని తాజాగా అనౌన్స్ చేశారు. దీనికి 'జాంబీ రెడ్డి' అనే టైటిల్ని నిర్ణయించినట్టు చిత్ర నిర్మాణ సంస్థ యాపిల్ స్టూడియోస్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. టైటిల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు ప్రోమోను కూడా రిలీజ్ చేసింది.

తెలుగులో తొలి 'జాంబీ' జోనర్ చిత్రమిదని చిత్ర నిర్మాణ సంస్థ ఈ సందర్భంగా పేర్కొంది. వాస్తవ సంఘటనల ఆధారంగా కరోనా వైరస్ సృష్టిస్తున్న విలయం నేపథ్యంలో హారర్ అంశాలతో ఇది రూపొందుతోంది. రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మార్క్ కె.రాబిన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
Prashanth Varma
Kalki
Corona Virus
Zombie Reddy

More Telugu News