Fatima Rehena: అర్ధనగ్న శరీరంపై బొమ్మలు వేయించుకున్న ఉద్యమకారిణికి బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

Supreme Court denies bail plea of Rehena Fatima
  • అర్ధనగ్న శరీరంపై పిల్లల చేత బొమ్మలు వేయించుకున్న రెహానా ఫాతిమా
  • ఇలాంటి కేసు రావడంతో కంగారు పడ్డామన్న సుప్రీంకోర్టు
  • ఇలాంటి ఆలోచన రావడమే దారుణమని వ్యాఖ్య
సామాజిక ఉద్యమకారిణి రెహానా ఫాతిమాకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అర్ధనగ్న శరీరంపై తన పిల్లల చేత బొమ్మలు వేయించుకున్న కేసులో బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. ఇలాంటి కేసు రావడం వల్ల కొంచెం కంగారు పడ్డామని కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇలాంటి వీడియోలను చూడటం వల్ల మన దేశ సంస్కృతిపై పిల్లలు ఎలాంటి భావాన్ని ఏర్పరుచుకుంటారని ప్రశ్నించింది. ఇలాంటి ఆలోచనలు రావడమే దారుణమని చెప్పింది. ఆమె ఉద్యమకారిణి కావచ్చని... అయినప్పటికీ ఇలాంటి వాటిని అనుమతించలేమని తెలిపింది. బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.
Fatima Rehena
Half Naked
Supreme Court

More Telugu News