Keerti Suresh: నాటి సంచలన చిత్రానికి సీక్వెల్.. కథానాయికగా కీర్తిసురేశ్!

Keerthi Suresh plays lead role in the sequel of then hit movie
  • నలభై రెండేళ్ల క్రితం వచ్చిన 'ఎర్రగులాబీలు'
  • అమ్మాయిలను హత్యలు చేసే సైకో పాత్రలో కమల్
  • సీక్వెల్ కి భారతీరాజా తనయుడి ప్రయత్నాలు
  • కీర్తి సురేశ్ తో ప్రస్తుతం సంప్రదింపులు
నలభై రెండేళ్ల క్రితం వచ్చిన 'ఎర్రగులాబీలు' చిత్రం అప్పట్లో ఒక సంచలనం. కమలహాసన్, శ్రీదేవి జంటగా భారతీరాజా దర్శకత్వంలో తమిళంలో వచ్చిన 'సిగప్పు రోజక్కల్' తమిళ చిత్రానికి ఇది తెలుగు డబ్బింగ్ వెర్షన్. కథ సరికొత్తగా అనిపించడంతో ఈ చిత్రం యువతను బాగా ఆకట్టుకుంది. నెగటివ్ టచ్ తో కూడిన ఒకవిధమైన సైకో పాత్రలో కమలహాసన్ చూపించిన అభినయం ఎన్నో ప్రశంసలు అందుకుంది.

ఇన్నాళ్లకు ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాటి దర్శకుడు భారతీరాజా తనయుడు మనోజ్ ఈ బాధ్యతలు తీసుకుంటున్నాడు. నాటి 'ఎర్రగులాబీలు'లో హీరో తనకు కనిపించే అందమైన అమ్మాయిలను ప్రేమముగ్గులో దించి, తదనంతరం అనుభవించి, తర్వాత వారిని హత్యలు చేసి, ఆ శవాలను పాతిపెట్టే సైకోగా కనిపిస్తాడు.

ఇక ఈ సీక్వెల్ లో ప్రేమపేరిట మోసం చేసే కుర్రాళ్లపై పగ తీర్చుకునే యువతిగా హీరోయిన్ పాత్రను తీర్చిదిద్దుతున్నారట. ఈ పాత్ర కోసం తాజాగా కీర్తి సురేశ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. కీర్తి సురేశ్ అయితే, ఈ పాత్రకు బాగా సూట్ అవుతుందని మనోజ్ భావిస్తున్నాడట.    
Keerti Suresh
Kamal Haasan
Sridevi
Bharathi Raja

More Telugu News