Nara Lokesh: జేసీ ప్రభాకర్ రెడ్డికి ఫోన్ చేసిన నారా లోకేశ్

Nara Lokesh calls JC Prabhakar Reddy
  • కడప జైలు నుంచి విడుదలైన జేసీ
  • జేసీ, అస్మిత్ లతో మాట్లాడిన లోకేశ్  
  • పార్టీ అండగా ఉంటుందని భరోసా 
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి కడప సెంట్రల్ జైల్ నుంచి నిన్న విడుదలయ్యారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో వీరిద్దరికి అనంతపురంలోని కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

జైలు నుంచి విడుదలైన తర్వాత వీరిద్దరూ తమ అభిమానులతో కలిసి నేరుగా తాడిపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డికి టీడీపీ నేత నారా లోకేశ్ ఫోన్ చేశారు. ఇద్దరినీ పరామర్శించారు. అక్రమ కేసుల గురించి భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు జేసీ నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో వారి అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేరుకుంటున్నారు.
Nara Lokesh
JC Prabhakar Reddy
Telugudesam

More Telugu News